నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది.
రాఘవ్ జుయల్ కీలక పాత్రలో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బలమైన క్యారెక్టర్స్‌తో కూడిన కథ ప్రేక్షకులకు విజువల్ స్పెక్టకిల్‌తో పాటు స్ట్రాంగ్ కంటెంట్ అందించడానికి రెడీ అవుతోంది. ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.
Also Read:KTR:యువకుల మృతి కలిచివేసింది
ఇక ఈ సినిమాలో నాని పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా నాని నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో నానితో పాటు మిగిలిన నటీనటులు కూడా షూట్ లో జాయిన్ అవుతారట. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

