సూపర్ స్టార్ మహేష్ బాబు..రాజమౌళి దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సరసన ప్రియాంక చోప్రా జొనాస్ హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ని వేశారు. ఈ సెట్‌లో చాలా కీలకమైన షెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
Also Read:KTR:యువకుల మృతి కలిచివేసింది

