‘బిగ్ బాస్’ సీజన్ -1కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, సీజన్ -2 ను కూడా స్టార్ట్ చెయ్యాలని నిర్వాహకులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ సీజన్ -1కు వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తికట్టించాడు యంగ్ టైగర్.
అయితే.. ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టమే. త్రివిక్రమ్-ఎన్టీఆర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందన్ని విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో జూనియర్ ఎన్టీఆర్ బిజీ కానున్నాడు.
దీంతో ..‘బిగ్ బాస్’ సీజన్ -2లో చేసేందుకు తనకు కుదరదని ఎన్టీఆర్ చెప్పేశారట. మరి, వ్యాఖ్యాతగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మేరకు ఓ సహజనటుడు నాని ని వ్యాఖ్యాతగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.. కాగా, ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానా తో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘అ!’ సినిమా ద్వారా నిర్మాత మారిన నాని, ఇకపై బుల్లితెరపై వ్యాఖ్యాతగా కనిపించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.