నాని ‘ది ప్యార‌డైజ్’గ్లింప్స్‌..

15
- Advertisement -

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది ప్యార‌డైజ్‌. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. చ‌రిత్ర‌లో అంద‌రూ చిల‌క‌లు, పావురాలు గురించి రాసి ఉంటారు గానీ, కానీ అదే జాతిలో కాకుల గురించి రాయ‌లేదు. ఇది క‌డుపు మండిన కాకుల క‌థ‌.’ అంటూ సాగే వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తం ఎనిమిది భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్ భాష‌ల్లో రానుంద‌ట‌. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌దని తెలుస్తోంది.

- Advertisement -