వాడొచ్చాక జీవితమే మారిపోయింది..

246
Nani talks about MCA
- Advertisement -

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడో స్టార్‌ హీరోగా ఎదిగారు నాని. ఆయన సినిమా అంటే బాక్సాఫీసు వద్ద వసూళ్లు ఖాయం అనేలా విజయాలు అందుకొంటున్న నాని తాజాగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు నాని.. ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో ఉండే సంతోషాలు, సరదాలు ఎలా ఉంటాయో నా పాత్రలోనూ అవే ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ సాయిపల్లవి నటన గుర్తుండిపోతుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తాయి. ‘‘ఎం.సి.ఎ ట్రైలర్‌లో ఏ కథైతే కనిపిస్తుందో అదే ఈ సినిమా అన్నారు నాని.

Nani talks about MCA

దర్శకుడిగా వేణుశ్రీరామ్‌కే అవకాశం ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు చాలామంది. మనం విజయం సాధించామని తర్వాతి సినిమాకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కావాలంటే కొత్త దర్శకులు రారు. కొత్త కథలు తెరకెక్కే అవకాశమే ఉండదు. వేణు శ్రీరామ్‌ ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత గ్యాప్‌ వచ్చింది ఈ విషయాలేవీ నాకు అక్కర్లేదు. కథ ఎంత బాగా చెప్పాడు… దాన్ని ఎంతబాగా తెరకెక్కించాడనేది నాకు ముఖ్యం. ఈ మూవీ సహజంగా ఉండాలని వరంగల్‌లో తెరకెక్కించాం. జనాల మధ్య చిత్రీకరణకు ఇబ్బందులు ఎదురైనా సినిమా సహజంగా వచ్చింది’’

‘‘నాకు హారర్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ నేను మాత్రం ఎప్పటికీ హారర్‌ చిత్రాల్లో చేయను. నేను నిర్మిస్తోన్న ‘అ!’ కథ చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఇలాంటి ఓ కథ ఉందా? అనిపిస్తుంది. అది నచ్చే నిర్మించడానికి ముందుకొచ్చాను. ‘అ’ అనేది ఆశ్చర్యానికి గుర్తు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ ఆశ్చర్యానికి సంబంధించిన ఓ అంశం ఉంటుంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం.. ఇక ‘‘మా అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక జీవితమే మారిపోయింది. వాడు రాకముందు వరకూ షూటింగ్‌ అయ్యాకా ఇంటికెళ్లాలి కదా అని ఎప్పుడో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి అరగంటకు ఓ సారి వాడి ముఖం నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది’’ అని నాని తెలిపారు.

- Advertisement -