ఇది మనందరి సెలబ్రేషన్- హీరో నాని

50
nani
- Advertisement -

‘అంటే సుందరానికీ’ విజయం టీం సమిష్టి కృషి. ‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం అని నేచురల్ స్టార్ నాని అన్నారు. నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ జరుపుకుంది.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని నాని తెలిపారు. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్నారు. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే సుందరానికీ కూడా అలా అరుదైన సినిమానే. ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం భాగమౌతామన్నారు.. ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్ అని నాని చెప్పారు.

ante sundaraniki

‘అంటే సుందరానికీ’ కి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది.. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్‌లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’. సులువైన మార్గాలు చాలా వున్నపుడు ఇలాంటి అంటే సుందరానికీ లాంటి కథ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో వున్నాయి. మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌లో వున్నాయి. నాలో, మా టీమ్ అందరిలో వున్నాయి. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికీ వుంటుంది” అని నాని అన్నారు.

- Advertisement -