మెగాఫోన్ పట్టిన నాని సోదరి..

245
nani
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాని. హీరోగా నటిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాని. తాజాగా నాని సోదరి మెగా ఫోన్ పట్టారు. నాని అక్క దీప్తి తనే కథ రాసి మీట్ క్యూట్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించింది.

అయిదు డిఫరెంట్ కథలు ఉండే ఆంథాలజీగా ఈ సినిమాని నాని నిర్మాణ్ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాలోనే నిర్మించారు. ఇందులో సత్యరాజ్‌, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, రుహానీ శర్మ, శివ కందుకూరి నటించారు.

ఇన్నాళ్లు నేను ఒక్కడినే తెలివైనవాడిని అనుకునేవాడిని. కానీ తెలివైన ఒక అక్కకి తమ్ముడ్ని అని ఇప్పుడే తెలిసింది. ఇలా ఒక గొప్ప సినిమాని డైరెక్ట్ చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను అంటూ చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు నాని.

- Advertisement -