శ్యామ్ సింగరాయ్‌ ..టీజర్ డేట్ ఫిక్స్‌

82
nani
- Advertisement -

ప్రస్తుతం నేచుర‌ల్ స్టార్‌ నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా మిక్కీ జే మేయర్ అందించిన ఈ పాటను తెలుగు, తమిళ,కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేశారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో డైరెక్టర్ రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నవంబర్ 18న టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్‌తో ప్రకటించారు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -