నాని బ్యానర్ లో హిట్ …హీరోగా విశ్వక్ సేన్

548
hit
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని వాల్ పోస్ట‌ర్ సినిమా పేరుతో ప్రొడ‌క్ష‌న్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో మొదటి సినిమా ‘అ’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ మంచి విజయం సాధించింది. తాజాగా ఆయ‌న వాల్ పోస్ట‌ర్ సినిమాస్‌పై కొత్త సినిమా రూపొందిస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు.

హిట్ ది ఫస్ట్ కేస్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రానికి నూతన దర్శకుడు శైలెష్ కొలను దర్శకత్వం వహించగా. ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించనున్నారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు నాని.

ఇవాల్టీ నుంచి ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చిల‌సౌ ఫేమ్ రుహానీ శ‌ర్మ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌నున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -