నాని ఆ కథ కోసం రూ.50లక్షలు ఇచ్చాడట!

572
nani
- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని ప్రస్తుతం స్టార్ హీరోగా నిర్మాతగా కొనసాగుతున్నాడు. నాని నిర్మించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. ప్రస్తుతం నాని హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి మూవీలో నాని నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ఇటివలే పూర్తైంది.

nani

ఇక నాని ప్రస్తుతం ట్యాక్సివాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథను నాని ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడని తెలుస్తుంది. స్టోరీ కొత్తగా ఉండటంతో నాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారట. ఈమూవీతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీశ్ సినిమాలో నటిస్తున్నాడు నాని.

- Advertisement -