నానితో విక్రమ్ కుమార్‌ మూవీ..!

238
nani vikram kumar
- Advertisement -

సెలక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ మంచి సక్సెస్‌ను సాధించి నేచురల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. రియాల్టీకి దగ్గరగా నాని నటన ఉండటం,కథలు సైతం నేచురాలిటీగా ఉండటంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాగ్‌తో దేవదాసు మల్టీ స్టారర్‌ తర్వాత ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని త్వరలో మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.

మనం ఫేమ్‌ విక్రమ్ కుమార్‌తో మరో సినిమాకు కమిట్ అయ్యారు నాని. విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట నాని. వాస్తవానికి బన్నీతో సినిమా చేయాలనుకున్నారు విక్రమ్‌ కుమార్. అనివార్యకారణాలతో ఈ సినిమా వాయిదా పడటంతో నానితో మూవీకి కమిట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు.

ప్రస్తుతం జెర్సీ సినిమాలో క్రికెటర్‌గా కనిపించనున్నారు నాని. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -