విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌కత్వంలో నాని..

236
nani vikram kumar
- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రుస హీట్ల‌తో దూసుకుపోతున్నాడు. ఇటివ‌లే వ‌చ్చిన దేవ‌దాస్ మూవీ అంత పెద్ద విజ‌యం సాధించ‌క‌పోయినా నాని న‌ట‌న‌కు మాత్రం మంచి పేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న జెర్సీ సినిమాలో బిజీగా ఉన్నాడు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ నానితో ఓ సినిమా చేయాల‌ని కొంత కాలం నుంచే ట్రై చేస్తున్నాడు. అయితే నానికి ఉన్న క‌మిట్ మెంట్స్ వ‌ల్ల ఆ సినిమా ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.

nani

కొద్ది రోజుల క్రిత‌మే విక్ర‌మ్ కుమార్ నానికి క‌థ వినిపించాడు. నానికి కూడా స్టోరీ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడని టాక్. నాని సినిమాలు పూర్త‌య్యే లోపు అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల‌నుకున్నాడు విక్ర‌మ్ కుమార్. అయితే ఈస్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు ఉండ‌టం వ‌ల్ల ఈప్రాజెక్ట్ కూడా ఆల‌స్య‌మైంది. ప్ర‌స్తుతం బ‌న్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఆసినిమా త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తో మూవీ ఉండ‌నుంది.

jersy

అంత‌లోపు నానితో ఓ సినిమాను చేయ‌నున్నాడు విక్ర‌మ్ కుమార్. దాంతో విక్రమ్ కుమార్ అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియానున్నాయి.

- Advertisement -