మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. సంక్రాంతి పండగ సందర్భంగా నేచురల్ స్టార్ నాని, తన అభిమానులకు రోజుకో కానుక ఇస్తున్నారు. తన తర్వాతి చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ కు సంబంధించి, తాను పోషిస్తున్న రెండు పాత్రలను నాని అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఇవాళ కనుమ సందర్భంగా ఆ చిత్రంలోని ఓ పాటను నాని విడుదల చేశారు.
ఈరోజు కనుమ సందర్భంగా సినిమాలోని ఓ మాస్ పాటను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘దారి చూడు దుమ్మూ చూడు మామ..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాటకు ముందు నాని..‘పార్టీనా అని అంత మెల్లగా అడుగుతారేందిరా..చిత్తూరు మొత్తం మన పలకల శబ్దం వినపడాల..స్టార్ట్ మ్యూజిక్’ అంటూ రాయలసీమ యాసలో మాట్లాడటం హైలైట్‌గా నిలిచింది. పెంచల్ దాస్ ఈ పాట పాడారు. ఇందులో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ నటిస్తున్నారు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.