నాని…టక్ జగదీష్ సాంగ్ రిలీజ్

321
nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి కోలో కోల‌మ్మ కోలో అనే సాంగ్ విడుద‌ల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి దీన్ని ఆలపించారు. ఈ సాంగ్‌లో ఫ్యామిలీ అంతా క‌లిసి సంద‌డి చేస్తుండ‌డం చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది.

- Advertisement -