నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా నాని-శ్రీనిధి శెట్టి స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి A సర్టిఫికేట్ లభించింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తోంది.
ముఖ్యంగా అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఒక్క ప్రీ-సేల్స్ ఇప్పటికే $100K మార్క్‌ను దాటేశాయి.
డిస్ట్రిబ్యూటర్ అమెరికాలో 750కిపైగా షోలు ప్లాన్ చేయగా ట్రెండ్‌ను బట్టి చూస్తే హిట్ 3 అమెరికాలో నాని కెరీర్‌లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్‌గా నిలిచి దసరా రికార్డును అధిగమించే అవకాశముంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో కూడా ఏకకాలంలో విడుదల కానుంది.
Also Read:హిమాచల్, తిరుమలలో హై అలర్ట్

