బిగ్ బాస్ సిజన్ 2 ప్రారంభమైన రెండు వారాలు గడిచి మూడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సామాన్యురాలిగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపెంట్స్ మధ్య సరైన అనుబంధం లేకపోవడం వల్ల రోజు గొడవలు పెట్టుకుంటున్నారు. మొదటి రెండు వారాలు కాస్త కూల్ గా జరిగిన బిగ్ బాస్ 2 నిన్నటి నుంచి హాట్ హాట్ గా సాగుతోంది. కంటెస్టెంట్ లు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. దింతో హోస్ట్ నాని కూడా వారిపై ఫైర్ అయ్యాడు.
మొదటగా కెప్టెన్ గా కిరీటి ని సెలక్ట్ చేశారు బిగ్ బాస్. అయితే కెప్టెన్ టాస్క్ లో కిరీటి ప్రవర్తన బాలేదని..గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోన్నాడని నాని మండిపడ్డాడు. అమ్మాయిల వైపు మాట్లాడుతూ ఇతర కంటెస్టెంల మనోభావాలను దెబ్బతీస్తున్నావని నాని ప్రశ్నించారు. అలాగే మరికొంత మంది కంటెస్టెంట్ లపై నాని ఆగ్రహాం వ్యక్తం చేస్తోన్నారు. సెలబ్రెటిలయి ఉండి సాధారణ ప్రజల కంటె నీచంగా వ్యవహరిస్తోన్నారన్నారు. హౌజ్ లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తోన్నారని..కెప్టెన్ చెప్పిన మాట ఎవరూ వినడం లేదన్నారు నాని.
మరో కంటెస్టెంట్ కౌశల్ కూడా తన భావాన్ని వ్యక్తపరిచాడు. తొలిరోజు నుంచే కొంతమంది గ్రూపుగా ఏర్పడి తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని కౌశల్ నానికి తెలిపాడు. బిగ్ బాస్ తనకిచ్చిన టాస్క్ లో భాగంగా ఆ పనిచేస్తుంటే..పదేపదే దాన్నే ఎత్తి చూపుతున్నారని, హౌస్ లోని వారికి కనీసం ఇంకిత జ్నానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కౌశల్. మొన్న జరిగిన ఎపిసోడ్ లో కౌశల్ , తనీష్ లు కొట్టుకునేంత విభేదాలు వీరి మధ్యలో వచ్చాయి. మాట మాట పెరిగి ఇద్దరు వ్యక్తి గత విషయాలలో తలదూర్చుకున్నారు. ఇక మొదటి వారంలో సంజన ఎలిమేనేట్ కాగా మూడవ వారంలో ఎవరూ ఎలిమినేట్ అవుతారనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు.