న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలైన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 26.6 కోట్ల గ్రాస్ ను 15.7 కోట్ల షేర్ ను వసూలు చేసిందని అంటున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకూ చేసిందట ఈ సినిమా.
ఇక టాలీవుడ్ సినిమాలకు యూఎస్ మార్కెట్ చాలా ముఖ్యమైనదని అందరికీ తెలిసిందే. అందులోనూ ఇక్కడ విక్రమ్ కుమార్ సినిమాలకి .. నాని సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అనేసరికి మంచి కంటెంట్ తప్పని సరిగా వుంటుందనే ఉద్దేశంతో అంతా ఆసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఈ సినిమా అక్కడ 1మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.
ఈ ఏడాది అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాలలో, తొలి వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన ‘టాప్ టెన్’ చిత్రాల జాబితాలో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ 6వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో 3వ స్థానంలో నాని ‘జెర్సీ’ ఉండటం మరో విశేషం.
ఇప్పటివరకూ యూఎస్‌లో హయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ టాప్ 10 లిస్టు 2019.. 1.సాహో-$2 మిలియన్, 2.మహర్షి-$1.41మిలియన్, 3. జెర్సీ- $931K, 4.ఎఫ్ 2- $928K, 5. ఎన్టీఆర్ కథానాయకుడు- $863K, 6. గ్యాంగ్ లీడర్- $737K, 7. డియర్ కామ్రేడ్- $687K, 8. మజిలీ- $611K,9. ఓ బేబీ- $567K, 10. ఎవరు- $335K.
ఇక నాని తదుపరి `వీ` సినిమాపై దృష్టి సారించాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి నాని బృందం ఇప్పటికే బ్యాంకాక్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట.ఈ చిత్రంలో నాని విలన్ గా నటిస్తుంటే సుదీర్ బాబు హీరోగా నటిస్తున్నారు.