ఆది పెళ్లిలో స్టెప్పులేసిన నాని !

88
aadi
- Advertisement -

దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడయ్యాడు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో నిక్కీ గల్రానిని వివాహం చేసుకున్నారు ఆది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

మంగళవారం రాత్రి సంగీత్, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించగా.. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన తెలుగు హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్ స్టెప్పులేసి సరదాగా గడిపారు. ప్రస్తుతం ఆది, నిక్కీతో కలిసి నాని, సందీప్ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరకతమణి సినిమాలో ఆది, నిక్కీ కలిసి నటించగా.. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మార్చి 24వ కుటుంబసభ్యుల సమక్షంలో ఆది, నిక్కీల నిశ్చితార్థం జరిగింది.

- Advertisement -