వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పిస్తున్న సినిమా ‘అ!’. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా, అవసరాల, ఈషా, రెజీనా,నాని పాత్రల ఫస్ట్‌లుక్స్ విడుదల చేసి.. సినిమాపై ఆసక్తి రేకెత్తించిన చిత్ర యూనిట్.. టీజర్‌తో అంచనాలను మరింతగా పెంచేసింది.
దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా విభిన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా! విశ్వదాభిరామ ఫిబ్రవరి 16న రిలీజ్ రా మామ!’ అంటూ వేమన పద్యంలోని పాదాన్ని మార్చి పోస్టర్‌లో ఉంచారు. ఈ సినిమాలో నాని ఓ చేపకు వాయిస్ ఓవర్ అందించగా, రవితేజ ఓ మొక్కకు తన గాత్రాన్ని ఇచ్చారు.