- Advertisement -
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ. నాని సరసన నజ్రియా హీరోయిన్‌గా నటించగా ఈ చిత్రం నాని కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది.
తాజాగా ఓటీటీలో సినిమా రిలీజ్ అయింది. ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఇవాల్టి నుండి స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్నారు నాని. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నానీ కెరీర్‌లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -