నాని కొత్త మూవీ టైటిల్‌ ఎంటో తెలుసా..!

220
nani
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని అభిమానుల‌కు దీపావ‌ళి వేడుక‌లు కాస్త ముందుగానే మొద‌ల‌య్యాయి. ఎందుకంటే వాళ్లు ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. నాని క‌థానాయ‌కుడిగా ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ‌ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ 28వ చిత్రం ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న‌ది.

కొన్ని కాంబినేష‌న్లు ఇన్‌స్టంట్ క్రేజ్‌ను తీసుకొస్తాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్ స‌రిగ్గా అలాంటిదే. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ మూవీలో నాని జోడీగా మ‌ల‌యాళం భామ న‌జ్రియా ఫ‌హాద్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు తెలుగు సినీ కుటుంబంలోకి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతోంది. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తోన్న ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. న‌వంబ‌ర్ 21న ఒక‌ క‌ర్టెన్ రైజ‌ర్ ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఈ రోజు మంచిరోజు కావ‌డంతో సినిమాను ప్ర‌క‌టించామ‌ని వారు తెలిపారు.

తారాగ‌ణం: నాని, న‌జ్రియా ఫ‌హాద్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి
బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌

- Advertisement -