నేడు మేడారం 3,4 పంపుల వెట్ రన్…

224
Kaleshwaram
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడారం లో మొదటి రెండు పంపులకు వెట్ రన్ విజయంవంతం అయిన సంగతి తెలిసిందే. నేడు నందిమేడారంలోని పంప్ హౌజ్ లో ని 3,4 పంపులకు వెట్ రన్ చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 12గంటలకు 4.4 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మూడవ పంపుకు వెట్ రన్ జరుపనున్నారు. ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీటితో నంది మేడారం సర్జ్‌పూల్ (ప్యాకేజీ 6)కు జలకళ వచ్చింది.పంపులు నడిపించాలంటే సర్జ్‌పూల్‌లో నీటిమట్టం 138 మీటర్లు ఉండాలి. కానీ అంతకు మించిన నీటిమట్టాన్నే సర్జ్‌పూల్‌లో నిర్వహిస్తున్నారు.

ఇక్కడ మొత్తం ఏడు పంపులు ఏర్పాటు చేయగా, ఒక్కో మోటారుకు 124.4 మెగావాట్ల సామర్థం ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మోటార్లను కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తుండడంతో వీటికి బాహుబలి మోటార్లు అని పిలుస్తున్నారు. ప్యాకేజీ 8లో 139 మెగావాట్ల సామర్థంతో అతి పెద్ద పంపులు ఏర్పాటు చేస్తుండగా, రెండో స్థానంలో మేడారం పంపులు ఉన్నాయి. మూడో పంపును మధ్యాహ్నం స్విచ్ ఆన్ చేసి, ప్రారంభించి, సుమారుగా అరగంట పాటు ప్రయోగాత్మకంగా నడుపుతారు. దీంతో వచ్చిన నీరంతా మేడారం రిజర్వాయర్లోకి చేరుతుంది. సాంకేతిక పరిశీలన తర్వాత సమస్యలేవి లేకుండా వెట్న్ విజయవంతం అయిందని అధికారులు ప్రకటిస్తారు.

- Advertisement -