ఆనాటి శుభలేఖ..నేడు సోషల్‌ మీడియాలో..

340
nandamuri

నందమూరి హరికృష్ణ దుర్మరణంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

 nandamuri harikrishnaఈ క్రమంలో హరికృష్ణ బాలనటుడిగా, యువ నటుడిగా నటించిన చిత్రాల్లో ఫొటోలు, ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో వాహనం నడుపుతున్నప్పుడు, అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి ఫొటోలు, ఇలా అనేక ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.

హరికృష్ణ వివాహానికి సంబంధించిన శుభలేఖను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గమనార్హం. నందమూరి హరికృష్ణ, లక్ష్మీకుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్యచౌదరి, వెంకట్రావమ్మల పేరిట ఈ శుభలేఖ ఉండటం గమనార్హం.