ఎన్టీఆర్ జీవితంపై పుస్తకం రాస్తా: బాలకృష్ణ

41
ntr

కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ సీఎం ఎన్టీఆర్ 98వ జయంతి నేడు. ఆయన జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించగా నందమూరి బాలకృష్ణ…ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఎప్పుడూ మ‌న‌తోనే ఉంటారని..తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం పై నేనే పుస్తకం రాస్తానని…ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య అంశాల్లో చేర్చాలని తెలిపారు.

ఆయుర్వేదంపై నాకు పూర్తి నమ్మకం ఉందని… తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ, కార్మికుల పార్టీ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని.. ఆయన స్పూర్తి తనను నడిపిస్తోంది పేర్కొన్నారు.