బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం

143
- Advertisement -

నందమూరి నటసింహం, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌ కు బయల్దేరిన హెలికాప్టర్‌ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ హెలికాప్టర్‌ ను అత్యవసరంగా ఒంగోలులో ల్యాండ్‌ చేశారు. అయితే నిన్న ఒంగోలులో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహరెడ్డి సినిమా ఫ్రీరిలీజ్‌ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు బాలకృష్ణ హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు ప్రత్యేక హెలికాప్టర్‌ లో వెళ్లారు.

బాలయ్యతో పాటు హీరోయిన్‌ శృతిహాసన్‌, డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని కూడా బాలయ్య వెంట ఉన్నారు. కార్యక్రమం ముగించుకుని హెలికాప్టర్‌లో తిరిగి ప్రయాణమైన కాసేపటికే హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అవడంతో భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం హెలికాప్టర్‌ కు సంబంధించిన సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం డైలాగులు థియేటర్లలో మోతమోగించేలా కనిపిస్తున్నాయి. ‘నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్’ .. ‘పదవి చూసుకుని నీకు పొగరెక్కువేమో .. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి 

చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

మత్తెక్కిస్తున్న శ్రద్దాదాస్‌..

నేడు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌

 

- Advertisement -