కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

257
Kodi Ramakrishna
- Advertisement -

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. అలాంటి మంచి మ‌నిషి అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం బాధాక‌రం అని బాల‌కృష్ణ అన్నారు. గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలని భ‌గవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని బాల‌య్య తెలిపారు.

Kodi Ramakrishna

జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, బీవీఎస్ ర‌వి,గోపిచంద్ మ‌లినేని, సుధీర్ బాబు, అనీల్ రావిపూడి త‌దిత‌రులు కోడి రామ‌కృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తూ ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. కోడిరామకృష్ణ బౌతికకాయానికి చిరంజీవి దంపతులు, నటి అనుష్కా నివాళులర్పించారు. ఇండ‌స్ట్రీలో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన కోడి రామ‌కృష్ణ తెలుగు సినిమా స్థాయిని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లారు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించిన ఆయన 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Kodi Ramakrishna

కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆసుపత్రి నుండి ఫిలిం న‌గ‌ర్‌లోని త‌న నివాసానికి కోడి రామ‌కృష్ణ భౌతిక కాయాన్ని త‌ర‌లించారు. రేపు అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఛాంబ‌ర్‌లో ఆయ‌న‌ పార్ధివ దేహాన్ని ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తుంది. శనివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నార‌ట‌.

- Advertisement -