నాలుగు రోజుల క్రితమే..చావు గురించి!

2
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఉదయం 5:20 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఆయన మరణానికి నాలుగు రోజుల ముందే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అక్టోబర్ 4న గోవాలోని డోనా పౌలాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్యక్రమానికి నానా పటేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాజీ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను గుర్తుచేసుకున్నారు. ఆయన రాజకీయంగా పనిచేసిన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

కార్యక్రమంలో మాట్లాడిన నానా పటేకర్ జీవితం, మరణం గురించి కూడా ప్రస్తావించారు. మనమంతా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే. నేను రేపు ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి జీవితానికి చివరికి ఆ సమయం వస్తుంది. కానీ అది జరగకముందు నేను నన్ను నేను ఒక ప్రశ్న వేసుకోవాలి.. నేను చేయాలనుకున్న పనిని చేయగలుగుతున్నానా? అన్నారు.

Also Read:నటుడు నానా పటేకర్ కన్నుమూత

ఈ వ్యాఖ్యలు చేసిన నాలుగు రోజులకే నానా పటేకర్ మృతి చెందడంతో ఆయన మాటలు అభిమానులను కలచివేస్తున్నాయి. నానా పటేకర్ చివరిసారిగా ‘ఓ రోమియో’ చిత్రంలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి, అవినాష్ తివారీ, దిశా పటానీలతో కలిసి కనిపించారు.

1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో ‘గమన్’ చిత్రంతో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘సలామ్ బాంబే’, ‘పరిం‍దా’ సినిమాలు ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచాయి.

- Advertisement -