మహేష్ ఓ వ్యసనంలా మారిపోయాడు..!

262
Namrata Shirodkar
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రతల జోడీ టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం మీద ఉన్న టాప్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు. ఒక్క హిందీ సినిమా చేయకున్నా మహేష్ కు నేషన్ వైడ్ ఫాలోయింగ్ ఉంటే.. గతంలో మిస్ ఇండియా కిరీటం గెలవడం.. బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో నమ్రతకు గుర్తింపు ఉంది. ఇక మహేష్ – నమ్రతల జోడీని చూస్తే అసూయకే అసూయ పుడుతుంది.

మహేష్ బాబు, నమ్రత జోడీ అటు రియల్ లైఫ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా నమ్రత మహేష్ గురించి ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహేష్ ఫొటో పెట్టిన నమ్రత దానిపై, “డియర్ డ్రగ్స్ నో థ్యాంక్స్, నాకు ఇప్పటికే మహేష్ బాబు ఓ వ్యసనంలా మారిపోయాడు” అంటూ క్యాప్షన్ పెట్టింది. డ్రగ్స్ కంటే కిక్ ఇచ్చే మహేష్ ఉండగా డ్రగ్స్ ఎందుకు? అంటూ నమ్రత పెట్టిన ఈ పోస్టుకు సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.

- Advertisement -