కాంగ్రెస్ నేత, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోర్టులో చుక్కెదరయ్యింది. నాంపల్లి కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కు కోర్టు నిరాకరించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన బంధువు సందీప్ రెడ్డి డబ్బులతో దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈకేసు విషయంలో నోటిసులు ఇవ్వడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆఫీసుకు వెళ్లిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టారని, గదిలో బందించారని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎస్సై కృష్ణ.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన్ని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. దీనికి తోడు ఆయన గత వారంరోజుల నుంచి అజ్నాతం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు పోలీసులు.