న‌మ‌స్తే ఇండియా అంటోన్న మైక్ టైసన్..

83
tyson
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న ఫ‌స్ట్ ప్యాన్ఇండియా మూవీ లైగ‌ర్ కు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో లెజెండ్ మైక్ టైసన్ నటించబోతోన్నారు. బాక్సింగ్‌లో మైక్ టైసన్ పంచ్‌ పవర్ అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంతో మైక్ టైసన్ ఇండియన్ తెరకు పరిచయం కాబోతోన్నారు. దీపావళి సందర్బంగా అందిరికీ విషెస్ చెబుతూ.. మైక్ టైసన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌.

ఈ పోస్టర్‌లో మైక్ టైసన్ బాక్సింగ్ రింగులో ఎలా దూకుడుగా కనిపిస్తారో అలానే పవర్ ఫుల్‌గా కనిపించారు. ఇక తన పంచ్‌లోని పవర్‌ను చూపించేందుకు రెడీగా ఉన్నట్టు అనిపిస్తోంది. నమస్తే ఇండియా రెడీగా ఉండండి అంటూ మైక్ టైసన్ లైగర్ సినిమా గురించి చెబుతూ దీపావళి సందర్భంగా విషెస్ తెలిపారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి ఫైటింగ్ చేస్తే, అలా ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.లైగర్ చిత్రంలో ఎంతో మంది ఫారిన్ ఫైటర్స్ కనిపించబోతోన్నారు. ముంబైలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం

దర్శకుడు : పూరి జగన్నాథ్
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్ : పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్ : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్ బాషా
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్ : కెచ్చా

- Advertisement -