తెలంగాణకు వర్ష సూచన..

94
rains

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్‌ ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొంచెం బలహీన పడిందని వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు కురిసి తెలంగాణలో రైతులు తీవ్రఇబ్బంది పడ్డారు. వరి ధాన్యం బస్తాలు చాలా చోట్ల తడిసిపోయాయి. కర్నాటకలో వర్షం దంచికొట్టింది. జోరు వానకు బెంగళూరులో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నీరు నిలువడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.