గ్రామాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు..సీఎం కేసీఆర్

525
puvvada
- Advertisement -

భారతదేశ చరిత్రలో గ్రామాల గురించి ఆలోచించిన ఏకైక నాయకులు సీఎం కేసీఆర్‌ మాత్రమేనన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాట్లాడిన ఆయన పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు బుణపడి ఉండాలన్నారు.

70 ఏళ్లుగా గ్రామ సమస్యలను నిర్లక్ష్యం చేశారని కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవ లేదు .. మనం కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ది చేసుకుందాం అని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి మొదటి విడుత అనేక సమస్యలను పరిష్కరించింది.. రెండో విడుతను విజయవంతం చేద్దాం అన్నారు.

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మంత్రి పువ్వాడ అజయ్‌. గ్రామ పంచాయితీలకు ప్రతీ నెల నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. గ్రామాలకు వెళ్లి చూస్తే మొదటి విడుత పల్లె ప్రగతి అభివృద్ది కనపడుతుందన్నారు.

24 గంటల కరెంటు , మిషన్ భగీరథ , రైతుబంధును అంతర్జాతీయ సమాజమే పొగుడుతుందన్నారు. ప్రతీ గ్రామాని కి ట్రాక్టర్ , వైకుంఠధామం , డంపింగ్ యార్డ్ , నర్సరీ కూడా ఉండాల్సిందేనన్నారు. రెండవ విడత పల్లె ప్రగతిని కూడా ప్రజలు , ప్రజాప్రతినిధుల , అధికారులు విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -