ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్‌పై చర్యలు..

431
nama
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి. ఆయనను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో టిఆర్ఎస్ లోక్ సభ పక్షం.. ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సభ్యుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టిఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు.

ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాల ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించారని.. పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాల ద్వారా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నామ డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ నామా నాగేశ్వరరావు.

- Advertisement -