నల్గొండ…గులాబీ కంచుకోట

144
- Advertisement -

నల్గొండ జిల్లా చైతన్యానికి మారుపేరు. నాడు రజకార్లను తరిమికొట్టిన దగ్గరి నుండి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం వరకు ప్రజాపోరాటాల వైపే నిలిచారు ప్రజలు. ఇక నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అయితే కమ్యూనిస్టులకు అడ్డా. ఈ జిల్లా నుండి ఎందరో రాజకీయ నాయకులు దేశ,రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇదంతా గతం. ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారు..

ఇందులో భాగంగా నల్గొండ జిల్లా చరిత్రలో తొలిసారి 12 అసెంబ్లీ స్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని సత్తాచాటింది. వాస్తవానికి 2018లో జరిగిన ఎన్నికల్లో హుజుర్‌నగర్‌,మునుగోడులో కాంగ్రెస్ గెలుపొందింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు స్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహాయ్య మరణంతో ఖాళీ అయిన స్ధానంలో ఆయన కుమారుడు భగత్‌కు పట్టం కట్టారు జిల్లా ప్రజలు.

ఇక హుజుర్‌నగర్‌లో ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఓటమి పాలవగా సాగర్‌లో రాజకీయకురువృద్దుడు జానారెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక జిల్లాలో కొంతమేరకు పట్టుఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కూడా మునుగోడు ఉప ఎన్నికతో చెక్ పడింది. రాజగోపాల్‌ రెడ్డిని ఓడించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్ కంచు కోట లు అన్ని మంచు కొండల్లా కరిగి పోయాయి. ఇక విశేషం ఏంటంటే హుజుర్‌నగర్‌,సాగర్‌లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

ఇవి కూడా చదవండి..

బీజేపీకి వ్యతిరేక పవనాలు..

ఈ తీర్పుతో బీజేపీకి మైండ్‌బ్లాంక్‌:దాసోజు

కారును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం

- Advertisement -