ఏపీలో బలపడేందుకు బీజేపీ కొత్త ప్లాన్ లు వేస్తోందా ? బలమైన నేతల కోసం వేట కొనసాగిస్తోందా ? అంటే అనుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో బలపడాలని ఎప్పటి నుంచే ప్రయత్నిస్తున్న కమలంపార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి సరైన నాయకత్వపు బలం లేకపోవడం, నేతల మద్య సక్యత లేకపోవడం వంటి కారణాలతో ఏపీలో బీజేపీ పుంజుకోవడం లేదు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజు ఆశించిన స్థాయిలో పార్టీకి మైలేజ్ తీసుకురావడం లేదు. అంతేకాకుండా పార్టీలో ఉన్న నేతలు కూడా పక్కా పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో పార్టీని బలపరచాలంటే బలమైన నేతలు అవసరమని భావిస్తున్న కాషాయపార్టీ.. ప్రస్తుతం నేతలను ఆకర్షించే పనిలో ఉంది. అందులో భాగంగానే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు అధిష్టానం ఆసక్తి చూపిస్తోందట. .
కిరణ్ కిరణ్ కుమార్ కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు టాక్. రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమైఖ్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆ మద్య ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీలో చేరినప్పటికి యాక్టివ్ గా లేరాయన. దాంతో ప్రస్తుతం ఆయనపై బీజేపీ గురి పెట్టినట్లు తెలుస్తోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితే.. పార్టీకి బలం పెరుగుతుందని అధిష్టానం భావిస్తుందట. దాంతో ఆయనకు కీలక బాద్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కాషాయ కండువా కప్పుకొనున్నారు. ఆయనకు ఎలాంటి పదవి లభించబోతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి…