బిడ్డపై ఉన్న అతి ప్రేమే ప్రణయ్ హత్యకు కారణమైందని చెప్పారు నల్గొండ ఎస్పీ రంగనాథ్. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతీరావేనని మరో ఆరుగురి హస్తం ఇందులో ఉందన్నారు. ప్రణయ్ హత్యకు కోటి రూపాయలు ఇచ్చేలా బీహార్ గ్యాంగ్‌తో మారుతీరావు ఢీల్ మాట్లాడుకున్నారని అడ్వాన్సుగా రూ. 18 లక్షలు ఇచ్చారని చెప్పారు. ప్రణయ్ పై దాడి చేసి హతమార్చిన వ్యక్తిని శర్మగా గుర్తించామన్నారు. సాయంత్రం మిర్యాలగూడ కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
మారుతీరావు ధనవంతుడు కావడంతోనే హత్యకు సుఫారీ గ్యాంగ్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని..దీనికి మారుతీరావు కూడా అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసును మూడు రోజుల్లో చేధించామన్నారు. అమృత ఫిర్యాదు చేస్తే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం,నయీం గ్యాంగ్‌ల పాత్రపై విచారణ జరిపిస్తామన్నారు.
స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ కేసులో అమృత స్టేట్ మెంట్ తీసుకోవాల్సి ఉందన్నారు. అమృతను వదిలేస్తే భారీగా ముట్టజెప్పుతానని ఏడాది కిందట ప్రణయ్‌కు ఈ ఆఫర్ ఇచ్చినా దానిని అతడు తిరస్కరించాడని తెలిపారు.