POCSO:న్యాయస్థానం సంచలన తీర్పు

5
- Advertisement -

పోక్సో కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 22 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన తిప్పర్తి యాదయ్య, అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది.

2016, డిసెంబర్ 18న అమ్మాయి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు యాదయ్య. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 2016, డిసెంబర్ 21న చండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.35,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -