యూరియా బుక్కుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

5
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా బుక్కుతున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ లారీ యూరియా తీసుకుపోయి బ్లాక్‌లో అమ్ముకున్నాడు అని ఆరోపించారు. గన్‌మెనే లారీ యూరియా తీసుకుపోతే, ఎమ్మెల్యే గోదాం యూరియా తీసుకుపోయి ఉంటాడు అని ఎద్దేవా చేశారు.

రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది…13 లక్షల మంది విద్యార్థుల మంచి కోసం తెచ్చిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ పథకానికి డబ్బులు లేవని, ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నాడు అన్నారు. అదే 2014 వరకు కాంగ్రెస్ వదిలేసి పోయిన 3 వేల కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చినం అన్నారు.

నిన్న హైదరాబాద్‌లో వర్షాలకు ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు…హైదరాబాద్‌ని పట్టించుకునే వాడు లేడు.. ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, హైదరాబాద్‌ గురించి అడిగేటోడు కూడా లేడు…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను పెట్టారు కానీ, హైదరాబాద్‌లో వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ముగ్గురు మంత్రులను పెట్టలేకపోయారు అర్రాకె.

మనం 36 ఫ్లై ఓవర్‌లు కడితే, వీళ్ళు కనీసం రోడ్ల మీద బొక్కలు కూడా పూడ్చడం లేదు…హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే నాధుడే లేడు…చందానగర్‌లో పట్టపగలు బంగారం షాపులో దొంగతనం జరిగింది అన్నారు. క్రైమ్ రేట్ 41% పెరిగింది, లా&ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది…జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అయ్యాక, ఇప్పుడు తిరుగుతున్న ఒక్క మంత్రి కూడా కనబడడు అన్నారు.

ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే…మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇళ్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే,కేసీఆర్ లక్ష మందికి ఇంటి పట్టాలు ఇస్తే.. కాంగ్రెస్ కొన్ని వేల ఇళ్లు.. కూలగొట్టింది …ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టుడా – కేటీఆర్ ఒక ఇల్లు అన్నప్పుడు గొడవలు సహజంగా జరుగుతాయి.. బజారులో కోట్లాడుకోవొద్దు…సామరస్యంగా కలిసి మెలిసి పనిచేయాలని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్.

Also Read:POCSO:న్యాయస్థానం సంచలన తీర్పు

- Advertisement -