మొక్కలు నాటిన నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్…

199
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ కుమార్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి, గురువారం సాయత్రం కలెక్టర్ ప్రాంగణం లో మొక్కలు నాటారు .

ఈ సందర్బంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అతి త్వరలోనే ప్రజాదరణ పొందింది . ట్విట్టర్ వేదిక చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్ లో 2వ స్థానం ఆక్రమించింది అంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క ప్రజాదరణ అంతా ఇంతా కాదు .

భారతదేశం లో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి సంవత్సరం పాల్గొని , మండల స్థాయికి గ్రామీణ ప్రాంతాలకి మొక్కలు నాటేలా చేసి , వాటిని ఎదిగే బాధ్యత తీసుకుంటున్నాం . ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -