శ్రీ రాజేశ్వర సమర్పణలో ధృవ క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ సుంకర, మానస హీరో హీరోయిన్లుగా శివమణి రెడ్డి దర్శకత్వంలో ధృవకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాకు నేనే తోపు తురుము`. ఈ సినిమా ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు చలపతిరావు, ప్రతాని రామకృష్ణాగౌడ్, లయన్ సాయివెంటక్, న్యాయవాది నాగేంద్ర, హీరో అశోక్ సుంకర, దర్శకుడు శివమణి రెడ్డి, జానీ మాస్టర్, హీరోయిన్ మానస,సుమన్ శెట్టి, ప్రొడ్యూసర్ ధృవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగేంద్ర మాట్లాడుతూ – “రియాలిటీని అర్థం చేసుకోవడానికి ఒక రేంజ్‌లో చెబితే కానీ ఇప్పుడు అర్థం కావడం లేదని ఆలోచించి దర్శక నిర్మాతలు చేసిన సినిమా ఇది. ధృవ, అశోక్ సహా యూనిట్‌కు అభినందనలు“ అన్నారు.
మానస మనోహర్ మాట్లాడుతూ – “నా తొలి తెలుగు చిత్రం. చాలా మంచి రోల్ చేశాను. మా సినిమాను చూసి మా యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత ధృవకుమార్ మాట్లాడుతూ – “ముందు మా సినిమాను చూసి సెన్సార్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. నేను ఎవరినీ కించపరచడానికో, లేక బూతు సినిమానో తీయలేదు. కేవలం సమాజం కోసం చేసిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ శివమణి డిఫరెంట్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. నా తమ్ముడు, హీరో అశోక్ సినిమాకు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు సఫలం చేసి మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం“ అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ – “ఏదో ఒక సినిమా చేయాలని కాకుండా, మంచి మెసేజ్‌తో చేసిన సినిమా ఇది. ధృవ అతని తమ్ముడుని హీరో చేయాలని చేసిన ప్రయత్నం సక్సెస్ కావాలని భావిస్తున్నాను“ అన్నారు.
లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – “టైటిల్ మాత్రం ఆదిరిపోయింది. ఓ మంచి మెసేజ్‌తో కూడిన సినిమా చేయాలని సంకల్పించి అనేక అడ్డంకులను దాటి సినిమా చేయడం చిన్న విషయం కాదు. ఎంటైర్ టీంను అభినందిస్తున్నాను“ అన్నారు.
ప్రతాని రామకృష్ణాగౌడ్ మాట్లాడుతూ – “నిర్మాత కొత్తవాడైనా గట్స్‌తో సినిమా చేశాడు. ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసి ఈ సినిమా చేశానని, నిర్మాత చెప్పారు. అయితే చేసే ప్రయత్నం మంచిగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. సెన్సార్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఓ మంచి పాయింట్‌తో సినిమా చేసినందకు యూనిట్‌ను అభినందిస్తున్నాను. హీరో అశోక్ చక్కగా నటించారు. శివమణి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
హీరో అశోక్ కుమార్ మాట్లాడుతూ – “కొద్ది మంది వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడే తోపు తురుము అనే పదాలను వాడుతుంటాం. ఇలాంటి టైటిల్‌ను నా సినిమాకు పెట్టుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచించాను. అయితే అన్నీ క్రాఫ్ట్స్ నుండి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. శివమణి రాత్రి పగలు ఎంతో కష్టపడ్డారు. మంచి టీం కుదిరింది. అన్నయ్య ధృవ నిర్మాతగా ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్“ అన్నారు.
చలపతిరావు మాట్లాడుతూ – “సినిమా టైటిల్ బావుంది. అశోక్ హీరోగా కంటే చాలా చక్కగా డైలాగ్స్ రాశారు. తను మంచి రైటర్ అవుతాడు. . సినిమాలో ఏదో ఒక మెసేజ్ చెప్పాలని ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు శివమణి రెడ్డి మాట్లాడుతూ – “సమాజంలోని మంచి చెడులను గమనించి, మంచి చేయాలనుకునే ఓ యువకుడు ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిర్మాత ధృవ, హీరో అశోక్, చలపతిరావు బాబాయ్, అన్నయ్య సుమన్ శెట్టి సహా నటీనటులు, టెక్నిషియన్స్ చక్కటి సపోర్ట్‌ను అందించారు. అందరికీ థాంక్స్“ అన్నారు.
అశోక్ సుంకర, మానస, చలపతిరావు, సుమన్ శెట్టి, సూర్య, అప్పారావు, గౌతంరాజు, నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ః నందమూరి హరి, మ్యూజిక్ః ప్రేమ్ ఎల్.ఎం., కొరియోగ్రఫీః కపిల్, నిర్మాతః ధృవకుమార్, దర్శకత్వంః శివమణి రెడ్డి.