సోఫియా పెళ్లికి దేవుళ్లు దిగివస్తారట..!

547
Mother Sofia Hayat decides her wedding guest list
- Advertisement -

అందాలభామ సోఫియా హయత్ గుర్తుంది కదా? బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని క్రేజ్ పెంచుకున్న బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్, టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీకి గిఫ్టుగా నగ్న ఫోటో పంపిన సంగతి తెలిసిందే. తర్వాత  సోఫియా సన్యాసినిగా మారిపోయి బాలీవుడ్‌ని  నిర్ఘాంత పరిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకి సన్యాసం వదిలేసి మళ్లీ ఫ్యాషన్‌ దుస్తులు వేసుకోవడం మొదలుపెట్టింది.

ఇప్పుడైతే ఏకంగా పెళ్లికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాను ఓ వ్యక్తిని పెళ్లిచేసుకుంటున్నట్లు సోఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది, ‘త్వరలో నాకు కాబోయే భర్త పేరు వెల్లడిస్తాను. మార్చి మూడో లేదా నాలుగో వారంలో నా వివాహం జరగబోతోంది. ఆయన నాకు చాలా ప్రత్యేకం. మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది. శివుడు, బుద్ధుడు సహా దేవుళ్లంతా నా పెళ్లికి హాజరుకాబోతున్నారు. స్వర్గంలో ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు’ అని పోస్ట్‌ చేసింది.

Sofia Hayat

భారతీయ సంతతికి చెందిన సోఫియా హయత్ బ్రిటిష్ మాజీ సినీ నటి, మోడల్, సింగర్.. 2013లో ప్రపంచంలోని సెక్సీ యువతుల్లో 81వ స్థానం పొందారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా 2012లో ఆమెను అందమైన ఒంపుసొంపులున్న మహిళల జాబితాలో చేర్చింది. ఆమె వయసు గురించి మాత్రం భిన్నమైన వార్త్తలు వచ్చాయి. సోఫియా 1974లో పుట్టినట్లు కొన్ని పత్రికలు రాస్తే.. కాదు 1984లో జన్మించారని మరి కొన్ని పేర్కొన్నాయి.

- Advertisement -