ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ చుట్టూ కొనసాగుతున్న వివాదం వల్ల బంగ్లాదేశ్ క్రికెటర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొసైన్ శుక్రవారం వెల్లడించారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అన్నీ బాగానే ఉన్నట్లు మేము నటిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ వెలుపలికి మార్చకపోతే రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) హెచ్చరించడంతో, జట్టు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని నజ్ముల్ చెప్పారు.
వరల్డ్‌కప్ ఫలితాలు చూస్తే, మేము ఎప్పుడూ స్థిరంగా మంచి క్రికెట్ ఆడలేదు. గతేడాది బాగా ఆడినా, మరింత మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోయాం. కానీ ప్రతి వరల్డ్‌కప్ ముందు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మూడు వరల్డ్‌కప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను – ఇవన్నీ ఆటపై ప్రభావం చూపుతాయి అని నజ్ముల్ అన్నారు.
వరల్డ్‌కప్ ఎక్కడ జరిగినా సరే, సరైన మానసిక స్థితితో బరిలోకి దిగితే జట్టుకోసం శ్రేష్ఠంగా ఆడడంపైనే దృష్టి పెట్టాలని నజ్ముల్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని నజ్ముల్ తెలిపారు. తమీమ్‌ను ఇండియన్ ఏజెంట్ పేర్కొనడాన్ని అంగీకరించలేనిదని అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ కెప్టెన్‌పై, బంగ్లాదేశ్ అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకరిపై చేయడం చాలా బాధాకరం. మేము గౌరవాన్ని ఆశిస్తాం. క్రికెట్ బోర్డు మా సంరక్షకుల్లా ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలను నేను ఆటగాడిగా పూర్తిగా తిరస్కరిస్తున్నాను అని నజ్ముల్ స్పష్టం చేశారు.
Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

