వెంకీ కూతురితో అఖిల్ పెళ్లి…!

203
Nags son for Venkys daughter ?
- Advertisement -

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.  అక్కినేని నాగచైతన్య…హీరోయిన్ సమంత  వివాహం  అక్టోబ‌ర్ 6 న గోవాలో అంగరంగ వైభవంగా వివాహం జరగనుంది. ఈ పెళ్లికి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

 Nags son for Venkys daughter ?
అక్కినేని- దగ్గుబాటి కుటుంబాలు మరోసారి ఒకటి కాబోతున్నాయన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో  అక్కినేని నాగార్జున రామానాయుడు కూతురు ,వెంకటేష్,సురేష్ బాబు చెల్లి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య వీరిద్దరికి పుట్టిన సంతానమే. అంతా బాగుంది అనుకున్న టైంలో నాగార్జున అమలతో ప్రేమలో పడ్డారు. దీంతో లక్ష్మీ దగ్గుబాటితో విడాకులు తీసుకున్నారు. నాగ్ – అమలకు పుట్టిన సంతానమే అఖిల్. తర్వాత లక్ష్మీ  వ్యాపారవేత్త  శరత్ విజయరాఘవేంద్రని పెళ్లి చేసుకుంది.

నాగ్ అమలను వివాహం చేసుకున్న తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. కానీ తర్వాతి కాలంలో ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ కూతురిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త టీ టౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. కొద్ది రోజుల క్రితమే జివికే ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య వియ్యం కుదరింది. జివికె మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరి పెళ్లికి పెద్దలు పచ్చజెండా ఊపారు. వైభవంగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో అఖిల్ తిరిగి సినిమా రంగం వైపు దృష్టి సారించాడు.

 Nags son for Venkys daughter ?
ఇందుకు సంబంధించి తన మనసులోని మాటను వెంకీ  సన్నిహితుల వద్ద బయటపెట్టాడని సమాచారం. ఇందుకు నాగ్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. చైతూ-సమంత వివాహం తర్వాత అఖిల్ పెళ్లిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కినేని- దగ్గుబాటి కుటుంబాల వారసుడిగా రాణిస్తున్న నాగచైతన్య  సరసన అఖిల్ కూడా చేరనున్నాడు. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వెలువడుతుందన్న వార్తతో ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

- Advertisement -