ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోండి: కమల్‌

217
- Advertisement -

తమిళ రాజకీయాలపై ఇటీవల విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను చెన్నై, ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసంలో నగ్మా గంటపాటు భేటీ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి భేటీ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

Nagma's Political Meet with Kamal Haasan

ఈ భేటీలో వీరిద్దరూ ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశంపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే..తమిళ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కమల్ తన రాజకీయ ప్రవేశం ఎప్పుడో జరిగిపోయిందని, అంతేకాకుండా ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు చుర‌క కూడా అంటించారు కమల్‌.

Nagma's Political Meet with Kamal Haasan

ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోండని, డబ్బులు తీసుకుని దొంగలకు ఓట్లేసి మీరే ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారని అన్నారు. కాగా..రాజకీయాల్లో మార్పు రావాలని.. దీనిపై పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుందని కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -