ఒకప్పుడు తన మిల్కీ అందాలతో కుర్రకారుకు చెక్కిలిగింతలు పెట్టిన భామ నగ్మ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అగ్రహీరోలందరితోనూ నటించి తెలుగునాట స్టార్ హీరోయిగా వెలుగొందింది. ఈ క్రమంలో 2007 తరువాత నగ్మా సినిమాలకు పూర్తిగాదూరమైంది. చాలామంది హీరోయిన్లలాగే పాలిటిక్స్‌లో అరంగేట్రంచేసింది. కానీ, అక్కడ నగ్మాకు పెద్దగా కలిసిరాలేదు.దీంతో ఇప్పుడు ఈ ఆంటీ చూపు మళ్లీ నటనపై పడినట్లుంది.
అందుకేనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించింది.తెలుగులో పవర్ స్టార్కుండే క్రేజ్ అసామాన్యమని, వేరే ఏ హీరో కూడా పవన్‌ని ఆ విషయంలో బీట్ చేయలేరని చెప్పింది. పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ వస్తే వదులుకునేప్రసక్తే లేదని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.బెంగాల్లో కూడా పవన్ కల్యాణ్ కి సూపర్ క్రేజ్ ఉందనిచెప్పింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే నగ్మకి పర్సనల్‌గా చాలా ఇష్టమట. చివరిసారిగా నగ్మ నటించింది కూడా ఎన్టీఆర్ మూవీలోనే కావడం విశేషం.
అల్లరిరాముడు సినిమాలో ఎన్టీఆర్ అత్తగా నగ్మ నటించింది. అయితే అప్పటికిఇప్పటికి ఎన్టీఆర్ చాలా మారాడని చెబుతోంది ఈ బెంగాల్ బొమ్మ.నటుడిగా,మనిషిగా కూడా ఎన్టీఆర్ చాలా ఎదిగాడట. ఇక రీసెంట్ గా ‘నాన్నకు ప్రేమతో’సినిమాలో ఎన్టీఆర్ నటన అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ అని చెప్పిందినగ్మా. మరోసారి ఎన్టీఆర్‌తో యాక్ట్ చేయాలని ఉందని మనసులో మాట కూడాబయటపెట్టింది.క్యారెక్టర్ ఆర్టిస్టుగా నగ్మా లాంటి నటి ఇప్పటి సినిమాలకుచాలా బాగానే కుదురుతుంది. మరీ తెలుగు దర్శకనిర్మాతలెవరైనా నగ్మాకు అవకాశంఇస్తారేమో చూడాలి.