నాగశౌర్య 20…ఫస్ట్ లుక్‌

152
nagashourya
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య. ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో 20వ సినిమా చేస్తున్న నాగశౌర్య మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ కమ్ముల…మూవీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఒంటిపై పచ్చబొట్టు, కండలు తిరిగిన దేహం, చేతిలో బాణంతో చాలా సీరియస్‌గా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మనస్సు, ఆత్మ అన్నీ లక్ష్యం పైనే గురిపెట్టాయని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -