సమంత చివరి సినిమా ఇదేనా?

318
Nagarjuna to produce U Turn remake with Samantha
Nagarjuna to produce U Turn remake with Samantha
- Advertisement -

చైతుని పెళ్లాడాలంటే.. సినిమాలను వదులు కోవాలని సమంతకు నాగార్జున కండీషన్ పెట్టాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్ సమంత సినిమాలు చేయడం మానుకోనని తెగేసి చెప్పింది. దీనికి నాగచైతన్య సహా అక్కినేని ఫ్యామిలీ మొత్తం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కింగ్ నాగ్ సమంత చివరి చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

Akkineni-family-Smantha

కన్నడలో హిట్ అయిన యు-టర్న్ అనే సినిమాను ఆ మధ్య సమంత నాగచైతన్యతో కలిసి చూసిందట. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సమంతకు చాలా నచ్చిందట. అప్పటి నుంచి ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తే తానే నటించాలని సమంత ఆశపడుతోంది. రీమేక్ రైట్స్ కొని, తానే సొంతంగా నిర్మించే ఆలోచన కూడా చేసింది అమ్మడు. కారణమేంటో తెలియదు కానీ, సమంత ఆ సినిమాను రీమేక్ చేయలేకపోయింది.

Akkineni-family-Smantha

అయితే ఇప్పుడు కోడలి కోరికను తీర్చేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. సమంత కోసం యూటర్న్ మూవీ రీమేక్ ను నాగ్ కొనుగోలు చేశాడట. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే ఈ మూవీ నిర్మించాలని అనుకుంటున్నాడట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.ఈ సినిమాతో సమంత కెరీర్ కు ఎండ్ కార్డ్ వేయాలని నాగ్ భావిస్తున్నాడట నాగ్. మరీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వెయిట్ చెయ్యక తప్పదు.

- Advertisement -