అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా ‘మనం’ తెరకెక్కింది. అక్కినేని కుటుంబానికి చెందిన నాగార్జున .. నాగచైతన్య .. అఖిల్ .. ఈ సినిమాలో నటించి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు. ఒక కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలిసి నటించడం .. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడం అరుదైన విషయం. అక్కినేని వారసులు నటించడం వల్లనే కాదు .. అందుకు తగిన విధంగా కథ కుదరడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు చేరువైంది. ఈ రోజుతో ఈ సినిమా 4 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలు మరోమారు మనసును తాకగా నాగార్జున స్పందించారు.
ఈ సందర్భంగా నాగ్ తన తండ్రిని గుర్తుచేసుకుంటు… ‘మనం’ విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. మీరు మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసి, నవ్వించి, ఆఖరికి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఉంటాం. మేమంతా మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ నవ్వుకుంటాం నాన్నా..’ అని ట్వీట్లో పేర్కొన్నారు. నాగేశ్వరరావు తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫొటోను నాగ్ అభిమానులతో పంచుకున్నారు.
మరో విషయం ఏంటంటే.. నాగార్జున నటించిన తొలి చిత్రం ‘విక్రమ్’, ఆయన తండ్రి నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ మే23నే విడుదలయ్యాయి. ఇక్కడ మరో లాజిక్ ఉంది. 23ని తారుమారు చేస్తే 32. నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 32 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇవన్నీ కాకతాళీయంగా జరిగిపోయానని నాగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
It’s been 4 yrs since #Manam released. I hv been thinking of how you made us cry,laugh and finally inspire the family to face life and death!! we think of you all the time NANA and we smile🙏 #ANRliveson pic.twitter.com/XjCM1YrFne
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2018