గల్లీ క్రికెట్ లొల్లిలో.. ఐసీసీ తీర్పు…

241
icc plays third umpire role for-a gully cricket
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‎కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ గల్లీలో చూసినా క్రికెట్ ఆడుతున్న పిల్లలే కనిపిస్తారు. ఇక భారత్‎లో అయితే ఢీల్లీ నుంచి గల్లీ వరకు చాలా మంది చిన్నారులు క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంటారు. అయితే గల్లీలలో జరిగే క్రికెట్‎లో చిన్న చిన్న సందేహాలతో కూడిన గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో బ్యాట్ప్‎మెన్ ఔట్ అని బౌలర్, కాదని బ్యాట్స్‎మెన్ వాదనకు దిగుతుంటారు. ఇలాంటి సంఘటనే పాకిస్థాన్ గల్లీ క్రికెట్‎లో చోటుచేసుకుంది. ఈ గల్లీ పంచాయతీలో థర్డ్ ఎంపైర్‎గా ఐసీసీ వ్యవహరించడం విశేషం.

icc plays third umpire role for-a gully cricket

పాకిస్థాన్‎లో జరిగిన గల్లీ క్రికెట్ మ్యాచ్ లో ఓ బ్యాట్స్‎మెన్ బంతిని బలంగా కొట్టాడు.. కానీ ఈదురు గాలుల వల్లన ఆ బంతి మళ్లీ వెనక్కి వచ్చి వికెట్లను తాకింది. ఈ నేపథ్యంలో బౌలర్, బ్యాట్స్‎మెన్ మధ్య ఔటు..కాదు అనే వివాదం తలెత్తింది. ఈ వీడియోని సరదాగా ఐసీసీకి ట్వీట్ చేసి.. మీరే న్యాయం చెప్పండంటూ హమజా అనే వ్యక్తి అడిగాడు. ఈ ట్వీట్‎కి ఐసీసీ కూడా స్పందించడం ఆశ్చర్యం.

క్రికెట్ లా 32.1 ప్రకారం ఆ బ్యాట్స్‎మెన్ ఔట్ అని ఐసీసీ తీర్పు చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్యాట్స్‎మెన్ ఔట్ అయిన తీరును చూసి నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఒక లుక్కేసి.. మీరు ఓ సరదా కామెంట్ చెయ్యండి.

- Advertisement -