దేవదాస్‌ సీక్వెల్‌ చేస్తా:నాగ్

334
nagarjuna
- Advertisement -

అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ దేవదాస్. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉందని నాగార్జున తెలిపారు. నాని,నాగ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవదాస్. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్…ఈ సినిమా ఒప్పుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. ఒకటి స్క్రిప్ట్, రెండు అశ్వనీదత్, మూడు నాని. ఈ పాత్రలో నేను పెద్దగా నటించాల్సిన అవసరం లేదని స్క్రిప్ట్ వినగానే చెప్పేశా. అయితే, రెండో పాత్రలో నాని చేస్తున్నాడని తెలియగానే.. అతను కూడా నటించక్కర్లేదు.. సరిగ్గా సరిపోతాడని చెప్పా అన్నారు.

nagarjuna

నాన్నగారు బతికే ఉన్నారు అనడానికి ఇదొక్కటి చాలు… అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారని చెప్పారు. మల్టీస్టారర్‌ చేస్తే నానితో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని…ఈ సినిమతో ఆ కోరిక నెరవేరిందన్నారు. 27న ‘దేవదాస్‌’పండగలా రాబోతోందన్నారు.

శైలజారెడ్డి గారి అల్లుడు, యు టర్న్ రెండూ బ్రహ్మాండంగా ఆడాయని తెలిపారు నాగ్. అయితే, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రివ్యూలు చూసి సమంతా బాధపడిందన్నారు. సాయంత్రానికల్లా అంతా సెట్ అయిపోతుందని చెప్పా… అదే జరిగిందన్నారు.

- Advertisement -